Home Latest News మాజీ ఎంపీ కనకమేడలకు పదవి | మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్| సొలిసిటర్ జనరల్స్| దవీందర్ పాల్ సింగ్| సుప్రీంకోర్టు| సీఎం చంద్రబాబు| టీడీపీ – Andhra Waves

మాజీ ఎంపీ కనకమేడలకు పదవి | మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్| సొలిసిటర్ జనరల్స్| దవీందర్ పాల్ సింగ్| సుప్రీంకోర్టు| సీఎం చంద్రబాబు| టీడీపీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
మాజీ ఎంపీ కనకమేడలకు పదవి | మాజీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్| సొలిసిటర్ జనరల్స్| దవీందర్ పాల్ సింగ్| సుప్రీంకోర్టు| సీఎం చంద్రబాబు| టీడీపీ


డిసెంబర్ 23, 2025 3:13PMన పోస్ట్ చేయబడింది


సుప్రీంకోర్టులో మరో ఇద్దరు అదనపు సొలిసిటర్ జనరల్స్‌ను కేంద్రం నియమించింది. మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్‌తో పాటు దవీందర్‌పాల్ సింగ్‌ను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదంతో న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనకమేడల నియామకం న్యాయరంగంలో ఆయనకు ఉన్న అనుభవానికి, సామర్థ్యానికి గుర్తింపుగా రాజకీయ, న్యాయ వర్గాలకు ఎంపికయ్యారు. రాజకీయ జీవితంతో పాటు న్యాయరంగంలోనూ చురుకైన పాత్ర పోషించిన ఆయనకు ఇప్పుడు దేశంలో కీలక బాధ్యతలు అప్పగించడం ప్రత్యేకంగా నిలుస్తోంది.

ఎన్డీయే ప్రభుత్వ విధానాలకు సంబంధించిన న్యాయ సంబంధిత రవీంద్ర కుమార్ పాత్ర పోషించనున్నారు. రాజ్యాంగపరమైన వివాదాల్లో ప్రభుత్వ వాదనను ఆయన బలంగా వినిపిస్తారని కేంద్రం భావిస్తోంది. రవీంద్ర కుమార్‌కు ఈ పదవి వరించడంతో తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఆనందం వెల్లివిరిసింది. పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అనుభవజ్ఞుడైన న్యాయవాదికి ఈ పదవి రావడం సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ వాదనకు బలం చేకూరుతోందని తెలుగు ప్రజలు అభిప్రాయపడుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird