Home Latest News జగన్ బెదిరింపు రాజకీయాలు…ప్రజా విశ్వసనీయత ఎక్కడ? | వైఎస్ జగన్| YSRCP| PPP మోడల్| టీడీపీ| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| కాకాణి గోవర్ధన్ రెడ్డి| అమిత్ షా| సూపర్ సిక్స్ – Andhra Waves

జగన్ బెదిరింపు రాజకీయాలు…ప్రజా విశ్వసనీయత ఎక్కడ? | వైఎస్ జగన్| YSRCP| PPP మోడల్| టీడీపీ| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| కాకాణి గోవర్ధన్ రెడ్డి| అమిత్ షా| సూపర్ సిక్స్ – Andhra Waves

by andhra andhrawave
0 comments
జగన్ బెదిరింపు రాజకీయాలు...ప్రజా విశ్వసనీయత ఎక్కడ? | వైఎస్ జగన్| YSRCP| PPP మోడల్| టీడీపీ| సీఎం చంద్రబాబు| నారాలోకేష్| కాకాణి గోవర్ధన్ రెడ్డి| అమిత్ షా| సూపర్ సిక్స్


డిసెంబర్ 23, 2025 12:56PMన పోస్ట్ చేయబడింది


వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూటమి బెదిరిస్తున్నాడు, అరెస్ట్ చేస్తానంటున్నాడు. ప్రభుత్వ భాగస్వామ్యానికి ఎవరైనా ముందుకు వస్తే, తాను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేస్తానని ఆయన బెదిరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ మోడల్‌లో ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యాన్ని ఆహ్వానించినందుకు నిరసనగా ‘కోటి సంతకాల సేకరణ’ కార్యక్రమం జరిగింది.

కోటి సంతకాలు చేసిన వారి చిరునామా, ఫోన్ నంబర్లు కూడా పొందుతామని, ఎవరైనా పరిశీలించుకోవచ్చని కూడా చెప్పారు. ఇది కొత్త విధానం. “మేము అబద్ధం చెప్పడం లేదు” అని నిరూపించుకునే ప్రయత్నం ముందుగానే చేశారు. ఇంతవరకు బాగానే ఉంది.ప్రైవేటు భాగస్వామ్యం గురించి ఒక అనుమానం వ్యక్తం చేయడం, అందుకు నిరసన వ్యక్తం చేయడం విపక్షంగా జగన్ బాధ్యత. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టగానే, ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించేందుకు జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారని భావించిన వారికి, ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన మాటలు వినగానే నిరాశే మిగిలింది.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 5 కోట్ల జనాభాలో, ఇంత తక్కువ వ్యవధిలో ఒక కోటి నాలుగు లక్షల సంతకాలు సేకరించడం అంటే అంత సులభం కాదు. ప్రతి పల్లెలోనూ, పట్టణాలలోనూ జనరల్ బాడీ మీటింగులు పెట్టినా సేకరించడం కష్టం. పల్లెల్లో సంతకాలు పెట్టడం మరీ కష్టం. అధికారపార్టీకి వ్యతిరేకంగా సంతకం పెట్టాలంటే ఖచ్చితంగా సంకోచిస్తారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ను ‘సంక్షేమ రాష్ట్రం’ అంటే ‘సంక్షేమ పథకాల రాష్ట్రం’ అంటే బాగుంటుంది. ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న ‘సూపర్ కూటమి సిక్స్’ పథకాలు కాక, వారి మేనిఫెస్టో ప్రకారం కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. తటస్థంగా ఉండేవాళ్ళు అంత బాహాటంగా రారు. పట్టణాలలో మీటింగులకు రావడమే కష్టం. అన్ని పరిమితుల మధ్య కోటి సంతకాలు సేకరించడం కష్టంతో కూడుకున్న పని. జగన్ రెడ్డి చెప్పే మాటలు ఎప్పుడూ దూరంగా ఉన్నట్లుగా కనిపించిన వెంటనే రుజువు అవుతూ ఉంటాయి.

అందుకే సంతకాల విషయంలో రుజువులు కూడా జత చేయవలసి వచ్చింది. ఇంత కష్టపడి కార్యకర్తలు చేసిన పనిని, ఆయన మీడియా ముందు మాట్లాడిన మాటలతో వృధా చేశారు. పీపీపీ మోడల్‌ను తాను ఇంతగా వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఎవరైనా ప్రైవేట్ వ్యక్తులు ముందుకు ప్రభుత్వ భాగస్వామ్యంలో వైద్య కళాశాలలు తీసుకుంటే, వారిని తాను అధికారంలోకి రాగానే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తానంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ వచ్చిన ప్రతి సందర్భంలోనూ ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసి బెదిరిస్తుంటారు. ఆయన అధికారంలోకి వచ్చిన రోజు మొదలు తెలుగుదేశంపార్టీ కార్యకర్తల నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు అరెస్ట్ చేసిన పనిలో పడి పాలనను మరచిపోవడమే జగన్ ప్రస్తుత పరిస్థితికి కారణం.

ప్రధానమంత్రి, అమిత్ షా ఆశీస్సులు ఉంటే చాలనుకుని పాలనకు దూరంగా ఉన్నారు. బటన్ నొక్కితే చాలనుకుని ప్రజలకు దూరం అయిపోయారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరెస్టులు వైసీపీకి ఎంతవరకు ఉపయోగపడ్డాయో అనే సమీక్ష జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ ఎప్పుడైనా చేసుకున్నారో లేదో కానీ, ప్రజలకు అరాచకం నచ్చకనే జగన్మోహన్ రెడ్డిని పక్కకు పెట్టారు. ఇప్పటి ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యాపార సంస్థలను వెళ్లగొడతాను అనే మాటతోనే ఆయన కాలం వెళ్లదీస్తున్నారు. ఆయనకు చాలా పెద్ద న్యాయవాదుల బృందం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారిని జైల్లో పెట్టడానికి చట్టరీత్యా అవకాశం ఉండదు అనే కనీసపు సలహా కూడా ఇస్తున్నట్లుగా లేదు. ఆయనకు రాజకీయ సలహాదారులు కూడా అనేకమంది ఉన్నారు.

బెదిరందువలన ప్రజలు ఓట్లు వేయరు అనే సలహా చెప్పడం లేదు. తానొక మాజీ ముఖ్యమంత్రి అనే విషయం మరచిపోయి, యోగా నాడు ప్రధాని ఆంధ్రప్రదేశ్ వచ్చి యోగా చేసిన విషయం పక్కన పెట్టి, మీడియా దినోత్సవం ముందు అభినయం చేస్తూ హేళన.. ఆయన ప్రజాక్షేత్రంలో ఇక ప్రజలను మెప్పించలేరు. అటువంటి అభినయం చూసిన వారు కొందరు ఆయన్ను కమెడియన్లతో పోలుస్తున్నారు. తాను అధికారంలో ఉండగానే గౌరవం కోల్పోయారు. బెదిరిస్తే బెదరరు అని అర్థమయ్యాక కూడా ‘జైల్లో పెడతాము’ అంటారు.

ఉద్యోగులను రిటైర్ అయినా వదిలిపెట్టం అని అంటారు. జగన్మోహనరెడ్డి ఎలాగూ అంటున్నాడు కాబట్టి మేము తక్కువ కాదు అన్నట్లు కాకాణి గోవర్ధన్ రెడ్డి.. ఇరిగేషన్ డిపార్టుమెంటు ఉద్యోగులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కుమ్మక్కు అయి అవినీతి చేస్తున్నారంటూ, వాళ్ల ప్రభుత్వం రాగానే జైల్లో వేసి వాళ్ల ఆస్తులన్నీ జప్తు చేస్తారట. ‘సముద్రం లోపల ఉన్నా వదిలిపెట్టను’ అంటాడు జగన్. దేశమంతా అమలు చేస్తున్న పీపీ మోడల్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటున్నది. పథకంలో చాలా అప్రజాస్వామికమైనవి ఉంటే ముందుగా ఆపథకాన్ని ఛాలెంజ్ చేయాలి.

ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ ఒక నిదర్శనం, దానికి కొన్ని మార్గదర్శకాలు కాకుండా కొన్ని నిధులను కూడా సమకూర్చిన కేంద్రం మీద కనీస నిరసన తెలపకుండా.. కేంద్రం సూచించిన విధంగా పీపీపీ మోడ్‌లో కళాశాలలను ప్రమోట్ చేస్తున్న చంద్రబాబు నాయుడునో, భాగస్వామ్యానికి ముందుకు వచ్చిన ప్రైవేట్ వ్యక్తులనో అరెస్ట్ చేయడం జగన్ అవివేకానికి చిహ్నం. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వైద్య కళాశాలలలో ప్రభుత్వమే సీట్లు అమ్మే సంస్కృతిని పరిచయం చేసిందే జగన్మోహన్ రెడ్డి. అలాంటి పద్ధతిని ప్రవేశపెడుతూ ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీఓల పైన అప్పటి ప్రతిపక్షం టీడీపీ న్యాయపరమైన చర్యలు చేపట్టకపోవడం ఆశ్చర్యకరం.

ఆ విషయంలో ఇప్పటికీ పౌరులకు కనీస అవగాహన కలిగించకపోవడం టీడీపీ వైఫల్యానికి పరాకాష్ట. జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందుబాటులోకి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశ్యం అనుకుంటే, ముందుగా మెడికల్‌ను ప్రభుత్వమే అమ్మకానికి పెట్టిన తన పాలసీకి ప్రజలకు క్షమాపణ చెప్పి, పీపీపీ మోడ్‌లో వెళ్తున్న ప్రభుత్వ కూటమి ప్రభుత్వ న్యాయస్థానంలో సవాల్ చేయాలి. అటువంటి రూపకల్పన కేంద్రానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలి. జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నిలబడాలనుకుంటే వాస్తవాలు మాత్రమే ప్రజలకు వివరిస్తూ, ఒక పద్ధతిలో నిరసన తెలుపుతూ న్యాయపోరాటం చేయాలి.

కానీ ఆయన అధికారం గురించి, చంద్రబాబు నాయుడును జైలుకు పంపించడం గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. నిజంగా ప్రజల కోసమే అయితే సాదాసీదాగా లోకేష్ ప్రజలకు చేరువ కావాలి. ముఖ్యంగా వాస్తవాలు మాట్లాడాలి. మీడియా ముందు యోగా దినోత్సవానికి ప్రభుత్వం 330 కోట్లు ఖర్చు పెట్టిందని జగన్ చెప్పిన గంటకే.. యోగాకు ఖర్చు పెట్టింది 60 కోట్లు అని, అందులో 90 శాతం కేంద్రమే ఇస్తుందని ఆధారాలతో సహా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

అక్కడ జగన్ విశ్వసనీయత కోల్పోతున్నారు.ఇక రుషికొండ రాజభవనం గురించి జగన్ మాట్లాడకపోవడమే మంచిది. అధికారంలో ఉన్నప్పటి కంటే, అధికారం కోల్పోయాక జగన్మోహన్ రెడ్డి నమ్మకాన్ని కోల్పోయి, కూటమి ప్రభుత్వానికి మరో పదేళ్లు తానే బాటలు వేస్తున్నట్లుగా ఉన్నది. అందుకే జగన్ చెప్పే కోటి సంతకాలను కూడా ప్రజలు విశ్వసించలేక పోతున్నారు.



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird