Home Latest News భార్యాభర్తల బంధంలో ప్రేమ తగ్గకూడదంటే.. ఇలా చేయండి..! | భార్యాభర్తల మధ్య సంబంధంలో ప్రేమ తగ్గకూడదు|How help increase love between husband and wife| పెళ్లిలో ప్రేమ ఎలా సాగుతుంది – Andhra Waves

భార్యాభర్తల బంధంలో ప్రేమ తగ్గకూడదంటే.. ఇలా చేయండి..! | భార్యాభర్తల మధ్య సంబంధంలో ప్రేమ తగ్గకూడదు|How help increase love between husband and wife| పెళ్లిలో ప్రేమ ఎలా సాగుతుంది – Andhra Waves

by andhra andhrawave
0 comments
భార్యాభర్తల బంధంలో ప్రేమ తగ్గకూడదంటే.. ఇలా చేయండి..! | భార్యాభర్తల మధ్య సంబంధంలో ప్రేమ తగ్గకూడదు|How help increase love between husband and wife| పెళ్లిలో ప్రేమ ఎలా సాగుతుంది


డిసెంబర్ 20, 2025 4:20PMన పోస్ట్ చేయబడింది


ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని అపార్థాలు ఎదురైనా, ఎంత అరుచుకున్నా.. బంధాలు విడిపోకుండా వాటిని కలిపి ఉంచేది ప్రేమ మాత్రమే. ప్రేమ లేనప్పుడు అన్ని ఉన్నా ఏమీ లేనట్టే ఉంటుంది. అంతే కాదు.. ప్రేమ లేని బంధాలు ఎక్కువ కాలం నిలబడవు కూడా. ఇద్దరు వ్యక్తులను అన్ని పరిస్థితులలో నిలిపి ఉంచేది ప్రేమ మాత్రమే. అయితే బార్యాభర్తల బంధంలో చాలా మంది ప్రేమ లేదు అంటూ ఉంటారు. కొందరేమో ప్రేమ లేకపోయినా కేవలం బంధం కోసం ఒక యంత్రంలా బ్రతికేస్తుంటారు. అలా ఉన్న బంధాలలో జీవం ఉండదు. భార్యాభర్తల బంధంలో ప్రేమ ఉన్నప్పుడు చాలా కాలం ఎంతో అన్యోన్యంగా ఉండేలా చేస్తుంది. అయితే భార్యాభర్తల బంధాన్ని బలంగా ఉంచే చిట్కాలు కొన్ని ఉన్నాయి. ఇవి మధ్య ప్రేమను పెంచి ఇద్దరిని మరింత దగ్గరకు తీసుకుంటాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే..

నిజాయితీగా ఉండాలి..

అనేది సంబంధానికి బలమైన పునాది నిజాయితీ. చిన్న విషయాలకు కూడా అబద్ధం చెప్పడం వల్ల సంబంధం దెబ్బతింటుంది. కాబట్టి ఎప్పుడూ నిజం చెప్పాలి. లైప్ పార్ట్నర్ ఫీలింగ్స్ ను కూడా గౌరవించాలి. నమ్మకాన్ని పెంచుతుంది, ప్రేమను నిజాయితీని పెంచుతుంది.

ప్రేమ.. మాటల్లో కాదు చేతల్లో..

చాలామంది మాటల్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి అదే నిజమైన ప్రేమ అనుకుంటారు. కానీ నిజమైన ప్రేమ అనేది చేతల్లో చూపించాలి. ఒకరికొకరు సమయాన్ని కేటాయించడం, ఒకరికొకరు సహాయం చేయడం, చిన్న చిన్న విషయాలలో కూడా కేరింగ్ గా ఉండటం ఇద్దరి మధ్య ప్రేమను బలపరుస్తుంది.

చిన్న సంతోషాలు..

ప్రేమను, సంతోషాన్ని పంచుకోవడానికి పెద్ద పెద్ద విజయాలు, పెద్ద సమయాలు, పెద్ద ప్లానింగ్ లు అవసరం లేదు. చిన్న చిన్న సందర్భాలను కూడా ఇద్దరూ కలిసి సంతోషంగా ఎంజాయ్ చేయవచ్చు. అభిరుచులను పంచుకోవడం, చిన్న సర్‌ప్రైజ్‌లు, చిన్న బహుమతులు లాంటివి మధ్య బంధాన్ని బలంగా మారుస్తాయి.

కమ్యూనికేషన్..

నేటి కాలంలో కమ్యూనికేషన్లు సరిగా లేకపోవడమే చాలా పెద్ద గొడవలకు కారణం అవుతోంది. ఆనందాలు, బాధలు, సమస్యలు, సంతోషకరమైన విషయాలను ఒకరితో ఒకరు పంచుకోవాలి. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏ ఇద్దరూ కలిసి ఆరోగ్యకరంగా డిస్కస్ చేసుకున్నప్పుడు మధ్య మంచి బంధం ఉంటుంది.

ఇగో..

బందాలను దెబ్బ తీసే అతిపెద్ద శత్రువు ఇగో.. చిన్న కోపతాపాలు లేదా కోపంలో మాట్లాడే మాటలు కూడా సంబంధాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి క్షమించడం నేర్చుకోవాలి. భార్యాభర్తలు ఏ గొడవలు జరిగినా ఇద్దరూ ఒకరినొకరు క్షమించడం నేర్చుకున్నప్పుడే బంధం నిలబడుతుంది. ఇగోను పక్కన పెట్టినప్పుడే ఇద్దరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు.

*రూపశ్రీ.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird