డిసెంబర్ 19, 2025 8:07PMన పోస్ట్ చేయబడింది

సికింద్రాబాద్ మోండా మార్కెట్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. శ్రీరామ ఎంటర్‌ప్రైజెస్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ అలముకోవడంతో మార్కెట్ పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని మంటలు ఇతర షాపులకు వ్యాపించకుండా అదుపు చేశారు. అగ్ని ప్రమాదం జరిగిన దుకాణంలో ప్లాస్టిక్ వస్తువులు ఎక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు.
.webp)