Home Latest News భక్తుల సౌకర్యార్థం తిరుప‌తిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ : టీటీడీ | టీటీడీ ధర్మకర్తల మండలం| TTD| తిరుమల| BR నాయుడు| టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్| సిహెచ్ వెంకయ్య చౌదరి| పలమనేరు – Andhra Waves

భక్తుల సౌకర్యార్థం తిరుప‌తిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ : టీటీడీ | టీటీడీ ధర్మకర్తల మండలం| TTD| తిరుమల| BR నాయుడు| టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్| సిహెచ్ వెంకయ్య చౌదరి| పలమనేరు – Andhra Waves

by andhra andhrawave
0 comments
భక్తుల సౌకర్యార్థం తిరుప‌తిలో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ : టీటీడీ | టీటీడీ ధర్మకర్తల మండలం| TTD| తిరుమల| BR నాయుడు| టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్| సిహెచ్ వెంకయ్య చౌదరి| పలమనేరు


డిసెంబర్ 16, 2025 2:56PMన పోస్ట్ చేయబడింది


టీటీడీ ధర్మ’కర’ల మండలి అధ్యక్షులు బీఆర్ నాయుడు అధ్యక్షతన మంగళవారం తిరుమ’ల అన్న’మ’య్య భవ’నంలో ధర్మకర్త’ల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణ‌యాలు ఇలా ఉన్నాయి. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు ప‌ల‌మ‌నేరులో 100 ఎకరాల్లో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయించారు.

తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాల అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా రూ.48 కోట్లు మంజూరు చేశారు. టీటీడీ బోర్డు ఎడ్యుకేషన్ స‌బి క‌మిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థ‌ల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లు, అవసరమైన సిబ్బంది, ఇతర సౌకర్యాలను కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో రూ.14.40 కోట్లతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం. భక్తుల సౌక‌ర్యార్థం తిరుప‌తిలోని 20 ఎక‌రాల‌లో ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్ నిర్మాణ ప్లానింగ్ కొర‌కు, ఆర్కిటిక్ట్ నియామ‌కానికి ఆమోదించారు.

దాత‌ల కాటేజీల నిర్వ‌హ‌ణ‌, నిర్మాణాల‌పై నూత‌న స‌మ‌గ్ర విధానం తీసుకురావాల‌ని నిర్ణ‌యంచారు. తిరుపతి జిల్లా తలకోన శ్రీ సిద్దేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ పనులలో భాగంగా రెండవ దశలో రూ.14.10 కోట్లు సమర్పించారు. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్‌ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్‌ సీట్లు పెంచాలని నిర్ణయించారు. టీటీడీ ఇంజనీరింగ్‌ డిగ్రీ నాలుగు కేటగిరిలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా త్వరలో భర్తీ చేయాలని నిర్ణయించారు.

టీటీడీ అనుబంధ ఆలయాలలో ప ని చేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూట‌ర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఇందులో
అర్చకులకు రూ.25,000/- నుండి 45,000/-
పరిచారకులకు రూ.23,140/- నుండి 30,000/-
పోటువర్కర్లకు రూ.24,279/- నుండి 30,000/-
ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు రూ.23,640/- నుండి 30,000/-కు జీతాలు పెంచారు



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird