డిసెంబర్ 16, 2025 11:53AMన పోస్ట్ చేయబడింది

హైదరాబాద్ పోలీసు శాఖలో తీవ్ర సంచలనం సృష్టించిన ఎస్సై భాను ప్రకాష్ వ్యవహారంలో పోలీసు శాఖ సీరియస్ యాక్షన్ కు దిగింది. భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ మిస్సింగ్ కేసులో ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. భాను ప్రకాష్ వ్యవహారంపై పోలీసుల దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగుచూశాయి. భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ మే నెల నుంచే మిస్సైందని తేలింది. కాకుండా భాను ప్రకాష్ సర్వీస్ రివాల్వర్ చోరీకి గురి కాలేదనీ, అంతే స్వయంగా భాను ప్రకాషే తన గన్ ను దొంగతనంగా బయటకు తీసుకువెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో రూఢీ.
స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన అధికారులు భాను ప్రకాష్‌గన్‌ను సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా ఉండేందుకు కెమెరాకు అడ్డుగా టేబుల్‌ను పెట్టి, ఆ తర్వాత తన ప్యాకెట్‌లో పెట్టుకుని బయటకు వెళ్లినట్లు పోలీసులు పేర్కొన్నారు. అతడు గన్ ను తీసుకువెళ్లిన రోజు నుంచే అది మిస్సైందని పేర్కొన్నారు. ఇక పోతే భాను ప్రకాష్ ఆర్థిక అరాచకత్వంపై కూడా పోలీసులు కూపీ లాగారు. భాను ప్రకాష్ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో కోటి రూపాయల వరకు నష్టపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఈ నష్టాల కారణంగానే సర్వీస్ గన్‌ను విక్రయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో మరెవరిదైనా ప్రమేయం ఉందా?, గన్ ఎవరికి అమ్మడు? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.
