డిసెంబర్ 15, 2025 8:49AMన పోస్ట్ చేయబడింది

ఆంధ్రప్రదేశ్ పలు కీలక రంగాల్లో ముందంజ వేస్తున్నది. ముఖ్యంగా పండ్లు, చేపల ఉత్పత్తిలో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. రిజర్వబ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ విషయం వెల్లడైంది. ఆంధ్రప్రదేశ్ 1 కోటి 93 లక్షల టన్నుల పండ్లను ఉత్పత్తితోనూ, 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితోనూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది.
అంతే కాకుండా ఏపీ ఆర్థికంగానూ స్థిరమైన వృద్ధిని సాధిస్తున్నట్లు ఆర్బీఐ నివేదిక. 2024–25 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ.15.93 లక్షల కోట్లు ఉండగా జీఎస్‌డీపీ రూ.2.66 లక్షలుగా నమోదైందని ఆ నివేదిక పేర్కొంది. అదే విధంగా విద్యుత్ లభ్యతలో ఏపీ1481 యూనిట్లతో దేశంలో 14వ స్థానంలో ఉంది. ప్రజారోగ్యం విషయంలో ఏపీ సగటు ఆయుర్దాయం 70 ఏళ్లుగా నమోదైంది. ఇందులో పురుషుల సగటు జీవితకాలం 68 సంవత్సరాలు కాగా, మహిళల సగటు జీవితకాలం 73 ఏళ్లుగా ఉంది.
