Home Latest News ఆ గుంట నక్కలకు చెప్తున్న తోలు తీస్తా…కవిత వార్నింగ్ | కల్వకుంట్ల కవిత| ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి| కేటీఆర్| కేసీఆర్| ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు| ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి| BRS పార్టీ| కాంగ్రెస్ పార్టీ – Andhra Waves

ఆ గుంట నక్కలకు చెప్తున్న తోలు తీస్తా…కవిత వార్నింగ్ | కల్వకుంట్ల కవిత| ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి| కేటీఆర్| కేసీఆర్| ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు| ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి| BRS పార్టీ| కాంగ్రెస్ పార్టీ – Andhra Waves

by andhra andhrawave
0 comments
ఆ గుంట నక్కలకు చెప్తున్న తోలు తీస్తా...కవిత వార్నింగ్ | కల్వకుంట్ల కవిత| ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి| కేటీఆర్| కేసీఆర్| ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు| ఎమ్మెల్యే మహేశ్వర రెడ్డి| BRS పార్టీ| కాంగ్రెస్ పార్టీ


డిసెంబర్ 12, 2025 11:57AMన పోస్ట్ చేయబడింది


పందెం కోళ్ల కేసులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బినామీ, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఎవరు ఎవర్ని కాపాడుతున్నారు? ఇవన్నీ నాకు తెల్వదా? ఆడపిల్ల కదా అని లైట్ తీసుకుంటారేమో ఒక్కొక్కడి తోలు తీస్తానని కవిత తెలియజేసారు. బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, టీ న్యూస్‌లకు లీగల్ నోటీసులు పంపించారు.

తనపై, తన భర్త అనిల్‌పై ఆధారాలు లేని ఆరోపణలు చేశారంటూ నోటీసులో తెలిపారు. వారం రోజుల్లో తనకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తో కలిసి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ఆరోపణలు చేస్తున్నారని అంటున్నారు. అలా మాట్లాడే గుంటనక్కలకు చెప్తున్నా. నా మీద అనవసరమైన దాడి చేస్తే మీ చిట్టా మొత్తం విప్పుతాని కవిత అన్నారు.

జనం బాటలో ప్రజల మధ్య తిరుగుతుంటే మీ అవినీతి, అక్రమాలు అన్నీ బయటికి వస్తున్నాయి. ఇది జస్ట్ టాస్ మాత్రమే. అసలైన టెస్ట్ మ్యాచ్ ముందుందని కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తాను కూడా ఏదో ఒక రోజు తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవినీతిపై ఎవరూ చర్యలు తీసుకోవడం లేదు. నాకు సమయం వస్తుంది. ఏదో ఒకరోజు సీఎం అవుతాను…2014 నుంచి ఇప్పుడు రాష్ట్రంలో జరిగిన స్కామ్‌లపై చర్యలు తీసుకుంటానని కవిత అన్నారు. తెలంగాణ జాగృతి జనం బాట పేరుతో కవిత విస్తృతంగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ప్రజా సమస్యల పరిష్కరం కోసమే జనం బాటలు వేశారు కవిత. జనం బాట కార్యక్రమం చేపట్టిన కవిత ఇప్పుడు మేడ్చల్, హైదరాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు



You Might Also Like

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird