Home Latest News పెళ్లికి నిరాకరణ…మరదలను గొంతు కోసి హత్య చేసిన బావ | హైదరాబాద్| నేర వార్తలు| సీఎం రేవంత్ రెడ్డి| సికింద్రాబాద్| ముషీరాబాద్| వెంకట రత్నం| హైదరాబాద్| రియల్ ఎస్టేట్| హత్య| మల్కాజిగిరి| జవహర్ నగర్| నేరం| దూల్‌పేట్| తెలంగాణ – Andhra Waves

పెళ్లికి నిరాకరణ…మరదలను గొంతు కోసి హత్య చేసిన బావ | హైదరాబాద్| నేర వార్తలు| సీఎం రేవంత్ రెడ్డి| సికింద్రాబాద్| ముషీరాబాద్| వెంకట రత్నం| హైదరాబాద్| రియల్ ఎస్టేట్| హత్య| మల్కాజిగిరి| జవహర్ నగర్| నేరం| దూల్‌పేట్| తెలంగాణ – Andhra Waves

by andhra andhrawave
0 comments
పెళ్లికి నిరాకరణ...మరదలను గొంతు కోసి హత్య చేసిన బావ | హైదరాబాద్| నేర వార్తలు| సీఎం రేవంత్ రెడ్డి| సికింద్రాబాద్| ముషీరాబాద్| వెంకట రత్నం| హైదరాబాద్| రియల్ ఎస్టేట్| హత్య| మల్కాజిగిరి| జవహర్ నగర్| నేరం| దూల్‌పేట్| తెలంగాణ


డిసెంబర్ 8, 2025 3:57PMన పోస్ట్ చేయబడింది


హైదరాబాద్ నగరంలో రెండు వేరు వేరు చోట్ల ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురికావడంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురౌతున్నారు. ఈరోజు ఉదయం తన పాపను స్కూల్ దగ్గర వదిలి వెళుతుండగా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మరువక ముందే ముషీరాబాద్ పరిధిలో ఓ దుండగుడు ఏకంగా ఇంట్లోకి చొరబడి మైనర్ బాలికను అతి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపుతోంది.

సికింద్రాబాద్ పరిధిలోని ముషీరాబాద్ డివిజన్‌కు చెందిన బాపూజీ బస్తీలో ఈరోజు సోమవారం మధ్యాహ్నం సమయంలో ఒక అగంతకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న 17 ఏళ్ల మైనర్ బాలికను కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసిన ఘటన స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన పవిత్ర కుటుంబం హైదరాబాదు నగరానికి వచ్చి ముషారాబాద్ నివాసానికి జీవనం కొనసాగిస్తోంది.

అయితే వరసకు మేనత్త కొడుకు ఉమా శంకర్ అమ్మాయి పవిత్ర ఇంటికి వచ్చి పెళ్లి చేసుకున్న ఇంట్లో గొడవ చేశాడు… అబ్బాయి పవర్‌తన బాగోలేదని తెలిసిన కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. వాళ్ళు నిరాకరించడంతో ఆగ్రహంతో మేన బావ ఉమా శంకర్ వెంటనే పక్కనే ఉన్న కిచెన్‌లోకి చాకు తీసుకెళ్లి అమ్మాయి పవిత్ర తల్లిదండ్రుల ముందే పవిత్ర గొంతు కోసి… పలుమార్లు పొడిచి.. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

జరిగిన వెంటనే బోద్ధనగర్, వారాసిగూడ ఎస్‌హెచ్‌ఓలు సహా పోలీసు సిబ్బందితో పాటు క్లూస్ టీం అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. పెళ్లికి నిరాకరించినందుకు కోపంతో పవిత్ర మేనబావ ఉమాశంకర్ ఈ దారుణానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు తెలిపారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.పవిత్ర హత్య కేసులో పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుడు ఉమాశంకర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఈ ఘటనతో బాపూజీ నగర్ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక యువతి హత్యపై ప్రజలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితుడిని త్వరగా పట్టుకో వాలని కోరుతున్నారు.



You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird