Home సినిమా పవర్ లిఫ్టింగ్ లో భారత్ కి గోల్డ్, సిల్వర్ మెడల్స్ ని తెచ్చిన నటి ప్రగతి – Andhra Waves

పవర్ లిఫ్టింగ్ లో భారత్ కి గోల్డ్, సిల్వర్ మెడల్స్ ని తెచ్చిన నటి ప్రగతి – Andhra Waves

by
0 comments
పవర్ లిఫ్టింగ్ లో భారత్ కి గోల్డ్, సిల్వర్ మెడల్స్ ని తెచ్చిన నటి ప్రగతి



తెలుగు సినీ పరిశ్రమలో నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు నటి ప్రగతి. ఈమెలో నటన మాత్రమే బరువులు ఎత్తే కళ కూడా ఉంది. పవర్ లిఫ్టింగ్ లో ప్రగతి దుమ్ము రేపుతోంది. ఇక ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్ లెవెల్ లో గోల్డ్ మెడల్ ని సొంతం చేసుకుంది.

టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాష్టర్స్ పవర్ లిఫ్ట్ ఛాంపియన్ షిప్ లో ఆమె భారత్ ని రిప్రెజెంట్ చేశారు. అలాగే నాలుగు పథకాలను సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్నీ ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసారు. ఓవర్ ఆల్ గా సిల్వర్ మెడల్, డెడ్ లిఫ్ట్ లో గోల్డ్ మెడల్, బెంచ్ అండ్ స్క్వాట్ లిఫ్టింగ్ లో రెండు సిల్వర్ మెడల్ ని సాధించింది.

ఇక సెలబ్రిటీస్ ఆమెను అభినందిస్తున్నారు. సింగర్స్ శ్రావణ భార్గవి, శ్రీరామచంద్ర, యాంకర్స్ స్రవంతి, ఆశు రెడ్డి, అరవింద్ కృష్ణా, జ్యోతక్క, మధుశాలిని, యాంకర్ ఝాన్సీ, నిఖిల్ విజయేంద్ర సింహ, నేహా చౌదరి, తేజస్విని గౌడ, రెజీనా కసాండ్ర వంటి వాళ్లంతా అభినందనలు తెలిపారు.

ప్రగతి ఎప్పుడూ జిమ్ లో ఫిట్నెస్ లో రెగ్యులర్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. ఇక ఆమె 2023 నుంచి పవర్ లిఫ్టింగ్ లో ఎంట్రీ ఇచ్చి ఆమె రెండేళ్లలోనే ఎన్నో మెడల్స్ ని కైవసం చేసుకుంది. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్ లో గోల్డ్, తెలంగాణ స్టేట్ లెవెల్ లో గోల్డ్ మెడల్స్ సాధించారు. తెనాలిలో జరిగిన నేషనల్ లెవెల్ పోటీల్లో ఐదవ స్థానంలో నిలిచారు. బెంగళూరులో జరిగిన నేషనల్ లెవెల్ బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ అలాగే కేరళలో జరిగిన నేషనల్ లెవెల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు.

ఇక 2024లో సౌత్ ఇండియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్‌లో బ్రోంజ్ మెడల్ ని సాధించగా ఇప్పుడు ఏషియన్ గేమ్స్ ఒక గోల్డ్ మూడు సిల్వర్ మెడల్స్ ని కైవసం చేసుకుని దేశ ప్రతిష్టను, ఇండస్ట్రీ ప్రతిష్టను మరింతగా పెంచింది.

You may also like

Leave a Comment

Andhra Wavesdelivers breaking news, insightful analysis, and in-depth features across a diverse range of topics including politics, economy, culture, technology, sports, and more. Whether you’re a resident of the region, a diaspora member, or simply interested in staying informed about the dynamic developments in Andhra Pradesh and Telangana, 

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Voice Bird